- పదిలో ఉత్తమ ఫలితాలు
- పలువురు అభినందనలు
నవతెలంగాణ- తాడ్వాయి
గురువారం వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో గ్రామీణ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తాడ్వాయి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. మండలంలో ఊరట్టం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల లో 24 మంది విద్యార్థినిలకు 24 మంది మొత్తం విద్యార్థులు పాస్ అయ్యారు. 100% ఉత్తమ ఫలితాలు సాధించారు. కొమరం సంజన 9.8 జిపిఏ సాధించి మండల టాపర్ గా నిలిచింది. కొండూరి ఐశ్వర్య 9.3 సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. నార్లాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో 16 మంది విద్యార్థులకు గాను 16 మంది పాసయ్యారు. 100% ఉత్తమ ఫలితాలను సాధించారు. బొప్ప ప్రియా మాధురి 9.8 జిపిఏ సాధించి మండల టాపర్ గా నిలిచింది. బొల్ల అఖిల 9.5 జిపిఏ సాధించి, ద్వితీయ స్థానంలో నిలిచింది. మండల కేంద్రంలోని కస్తూరిబా (కేజీబీవీ) పాఠశాలలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. బి రమ్య 9.0 జిపిఎస్ సాధించి ప్రథమ స్థానంలో ఉన్నారు. బి చందన 8.8 సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల తాడ్వాయి, 70 మంది విద్యార్థులకు గాను 70 మంది పాస్ అయి 100% ఉత్తీర్ణత సాధించారు. కబ్బాక సింధు స్వీ 9.7 జిపిఏ, తల్లడి తేజస్వి 9.7 సాధించి ఇద్దరు స్కూల్ టాపర్ లు గా నిలిచారు. ఆర్రెం సౌజన్య 9.3 సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇందిరానగర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారు. సాత్విక 9.2 జిపిఎస్ సాధించి స్కూల్ టాపర్ గా నిలిచారు. హిమబిందు 9.0 జిపిఎస్ సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. బీరెల్లి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో పదిమందికి గాను 9 మంది పాస్ అయ్యారు. కాటాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో 29 మంది విద్యార్థులకు గాను 22 మంది పాస్ అయ్యారు. పుల్లూరు స్పందన 9.2 జిపిఏ సాధించి స్కూల్ టాపర్ గా నిలిచారు. సాయిరి రమ్య, దిడ్డి త్రిషిత లు 9.0 జిపిఏ సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. మండలంలో నాలుగు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, నాలుగు జిల్లా పరిషత్ పాఠశాలలు, ఒక్క కస్తూరిబా మొత్తం తొమ్మిది పాఠశాలలు ఉన్నాయి. నాలుగు ఆశ్రమ పాఠశాలలో 225 మంది విద్యార్థులు గాను 225 మంది పాస్ అయి 100% ఉత్తీర్ణత సాధించారు. నాలుగు జిల్లా పరిషత్ పాఠశాలలో 71 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 63 మంది విద్యార్థులు పాసయ్యారు. 8 మంది విద్యార్థులు మాత్రమే ఫెయిల్ అయ్యారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 23 మంది విద్యార్థినిలకు గాను 22 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఒక్కరు ఆబ్సెంట్ అయ్యారు. మండల వ్యాప్తంగా 9 పాఠశాలలో 319 మంది విద్యార్థులకు గాను 311 మంది విద్యార్థులు పాస్ అయి 99.9 శాతం అధిక సంఖ్యలో ఉత్తీర్ణులై ఉన్నారు. తాడ్వాయి ఏజెన్సీలోని విద్య కుసుమాలకు మండలంలోని ప్రముఖులు తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్, తాడ్ వై ఎస్ ఐ వెంకటేశ్వరరావు, మిగతా ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Jun,2022 09:26PM