తెలంగాణ యాత్రికులందరూ టీఎస్ ఆర్టిసి బస్సులలో వెంకన్న దర్శనానికి సిద్ధం కండి..
శుక్రవారం నుంచి అమలులోకి వస్తున్న విధానం
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు బస్ టికెట్‌తో పాటే తిరుమల శీఘ్ర దర్శన టోకెన్ కూడా పొందే వీలు కల్పిస్తున్నాం..
టి.టి.డి ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి..
నవతెలంగాణ డిచ్ పల్లి.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి టి.ఎస్.ఆర్టీసీ బస్సులలో వెళ్లే ప్రయాణీకులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు అందించింది. టి.ఎస్.ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ టి సి కార్పొరేషన్ ఛైర్మెన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవతో టి.టి.డి ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. శుక్రవారం నుంచి ఇది అమలు చేస్తున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ తెలిపారు.ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టి.ఎస్.ఆర్టీసీ బస్సులలో ప్రయాణం ఎంతో సురక్షితమని, కుటుంబ సమేతంగా స్వామి వారిని సంతోషంగా దర్శించుకోవచ్చని తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా టి.ఎస్.ఆర్టీసీ ప్రయాణీకులకు రోజువారీ 300 రూపాయల ప్రత్యేక శీఘ్ర దర్శన టికెట్లను ఒక వెయ్యి మందికి జారీ చేయనుందని వివరించారు.తిరుమల వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కల్పించడం విశేష పరిణామమని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. టి.ఎస్.ఆర్టీసీకి యాత్రికుల ఆదరణ మరింత పెరగగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. టి.ఎస్.ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు.తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నామని వివరించారు. ఈ దర్శన టికెట్లను టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం ఉందని, అయితే బస్ టికెట్‌తో పాటే దర్శన టికెట్‌నూ బుక్ చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌తో పాటూ మరికొన్ని జిల్లాల నుంచి తిరుమల శ్రీవారి దైవ దర్శనం కోసం ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యవంతంగా ఉంటుందని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.టి.ఎస్.ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్లే భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వెయ్యి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఈ సౌకర్యం శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని వివరించారు. www.tsrtconline.in వెబ్ సైట్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చంటూ కనీసం 7 రోజుల ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఈ అమూల్యమైన అవకాశాన్ని టి.ఎస్.ఆర్టీసీ బస్సులో ప్రయాణించే భక్తులు వినియోగించుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Jul,2022 05:30PM