కేంద్ర విమానయానడ రోడ్డు భవనాల సహాయ శాఖ మంత్రి వి. కె సింగ్..
నవతెలంగాణ చివ్వేంల
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి బిజెపి లక్ష్యమని కేంద్ర విమానయాన రోడ్డు భవనాల సహాయ శాఖ మంత్రి వి. కె సింగ్ అన్నారు. వట్టిఖమ్మం పహాడ్ గ్రామంలో శక్తి కేంద్రం సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కేంద్రంలో 114 రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పడుతున్నదన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయల వరకూ కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకునే సదుపాయం కలిగేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 8కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించారని తెలిపారు. మళ్లీ మోడీని అధికారం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి, సంకినేని వరుణ్ రావు, లక్ష్మణ్ రావు, జంపాల వెంకటేశ్వర్లు, బిట్టు నాగరాజు, శ్రీనివాస్ నాయక్, అప్పి రెడ్డి, సతీష్, వీరస్వామి, మల్లయ్య, మల్లేష్, వీరాచారి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Jul,2022 06:09PM