నవతెలంగాణ-భిక్కనూర్
రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో పని చేస్తున్న యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కొరుతు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని దక్షిణ ప్రాంగణ అధ్యాపకులు చేస్తున్న ధర్నా కార్యక్రమం శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనున్న సందర్భంలో, తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం పిఆర్సి ప్రకటించిందని, కానీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన డిమాండ్ లను తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్. నారాయణ,అధ్యాపకులు సునీత, శ్రీకాంత్, నిరంజన్,సరిత,శ్రీమాత,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Jul,2022 06:31PM