కుంజ రాజేశ్వరరావు ప్రధానోపాధ్యాయులు.
నవతెలంగాణ-గోవిందరావుపేట.
ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ తయారుచేసిన కరపత్రాలను ప్రజలు క్షుణ్ణంగా చదివి కచ్చితంగా అమలు చేయాలని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల చల్వాయి ప్రధానోపాధ్యాయులు కుంజా రాజేశ్వరరావు అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్వాయిలో ములుగు జిల్లా వినియోగ దారుల సమాఖ్య అధ్యర్యంలో ప్లాస్టిక్ నిషేధ అవగాహన కరపత్రాలను ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంజ రాజేశ్వర్ రావు ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ఒకసారి వాడి పారేసే,ప్లాస్టిక్ వస్తువులను నిషేధించిన నేపథ్యంలో జిల్లా వినియోగదారుల సమాఖ్య రూపొందించిన, చైతన్య అవగాహన కరపత్రాలను జిల్లా వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధ కరపత్రాలను క్షుణ్ణంగా చదివి,మీ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మాని వేయాలని చెప్పారు. జిల్లావినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య మాట్లాడుతూ యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిపై,మురికి కాలువల్లో,నీటి వనరులలో, నదులలో,ఆవాస ప్రాంతాలలో,పర్యాటక ప్రాంతాలలో భారీ మొత్తంలో పేరుకోవడం వలన పర్యావరణానికి తీవ్రహాని కలుగుతోందని, దాదాపు ఎనభై శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు భూవనరులలో చేరడం వలన రాబోయే రోజుల్లో నీటి వనరులకు, పంటలకు,పశువులకు మాత్రమే గాక మనుష్యులకు,సకల జీవరాశికి,
పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందన్నారు. ప్రపంచంలో ఇప్పటికే, డెభై దేశాలు,ఒకసారి వాడి పారేసే, యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాయని,ప్లాస్టిక్ వలన సౌకర్యం,సౌలభ్యం,చౌక మొదలగు ప్రయోజనాలు ఉండి ఉండవచ్చు కానీ,ప్రకృతిని కబళించే శక్తి కూడా ఉందని అన్నారు. సమస్త జీవుల ప్రయోజనం,పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని మానివేయాలని అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉప్పుతల ప్రసాద్,దామరాజు సమ్మయ్య, బూత్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి,అందె రమాదేవి,శ్రీరాముల శ్రీనివాసరావు, భూక్య సరిత,సుతారి మురళీధర్, ముడుంబ వెంకటరమణమూర్తి,పి.శ్రీదేవి పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Jul,2022 06:57PM