నవతెలంగాణ-ధర్మసాగర్
ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన స్థానిక సీఐ ఒంటేరు రమేష్ కు కృతజ్ఞతలు తెలిపిన పరకాల వాసులు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం సహచర మిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి పుష్పగుచ్చాలా అందించి, శాలువాలతో సన్మానించి అభినందించారు.విధి నిర్వహణలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి పరకాల ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని ఈ సందర్భంగా వారు కోరారు. కలిసిన వారిలో మేకల దేవయ్య,కార్పొరేటర్ ఏకు రాజు, బట్టు రవి,రఘుపతి,నరేష్ తదితరులు ఉన్నారు.