నవతెలంగాణ-భిక్కనూర్
వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భిక్నూర్ పట్టణానికి చెందిన రాజలింగం (43) అంతంపల్లి గ్రామం వద్ద ఉన్న పెట్రోల్ బంకులు పనులు చేస్తుంటాడు. గత నెల 25 తేదీ నాడు పెట్రోల్ బంకు కి వెళ్తున్నాం అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి ఇంటికి రాకపోయేసరికి చుట్టుపక్కల, కుటుంబీకులు, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం భిక్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబీకుల ఫిర్యాదుమేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్‌పెక్టర్ ఆనంద్ గౌడ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm