- వసతి గృహాల్లో వందశాతం ఉత్తీర్ణత...
- అత్యధిక మార్కులతో బాలికలు ప్రతిభ....
- ప్రిన్సిపాల్ లు సంగీత,స్వప్న లకు ప్రశంసలు..
నవతెలంగాణ - అశ్వారావుపేట:
సమగ్ర సదుపాయాలు,సౌకర్యాలతో కూడిన వసతి ద్వారానే మెరుగైన ఫలితాలు సాధ్యం అని మానవ వనరుల అభివృద్ధి సూచికలు చెప్తుంటాయి. కానీ ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వసతి గృహాలు అన్నీ అద్దె భవనాలు,అరకొర వసతులతో నే కునారిల్లుతున్నాయి.అయినా గ్రామీణ ప్రాంత బాలికలు ఉత్తమ ఫలితాలు సాధించి ఔనా అనిపించారు.
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో మహాత్మ జ్యోతీ ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహ విద్యాసంస్థ,మైనార్టీ తెలంగాణ వసతి గృహ విద్యాసంస్థలకు చెందిన బాలికలు ఉన్నత పాఠశాల,జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో చదువుతున్న గ్రామీణ ప్రాంత బాలికలు మెరుగైన ఫలితాలు సాధించి వారి సత్తా చాటారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు సంగీత,శారా లిల్లీ,స్వప్న లు తెలిపిన వివరాలు ప్రకారం... ముందుగా మైనార్టీ గురుకుల 10 వ తరగతి విద్యార్ధులు పరీక్షలు రాసిన 32 మంది ఉత్తమ ఫలితాలు పొంది 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో సి.హెచ్ యశ్విత 10 కి పది జిపిఎ సాధించింది.ఎస్.కే సపూరా 9.7,పి.పల్లవి,ఎన్ హాసిని 9.3 జి.పి.ఎ సాధించారు.ఆరుగురు విధ్యార్ధినీలు 9 పైగా జి.పి.ఎ 6 విద్యార్ధులు మెరుగైన ఫలితాలు సాధించారు.
జూనియర్ కళాశాలలో ఎం.పి.సి,బై.పి.సి గ్రూపులకు గానూ 45 మంది పరీక్షలు రాయగా 39 మెరుగైన ఫలితాలు పొందారు.87 శాతం ఉత్తీర్ణత సాధించారు.
మహాత్మా జ్యోతి రావు ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహ విద్యాసంస్థ బాలికలు పాఠశాలలో పదవ తరగతి విద్యార్ధులు 41 మంది పరీక్షలు రాయగా 40 మంది ప్రతిభ కనబరిచారు.97 శాతం ఉత్తీర్ణత సాధించారు.9 పైగా జిపిఎ తో 35 మంది ఉత్తీర్ణత సాధించారు.
జూనియర్ కళాశాలలో రెండు గ్రూపులకు గానూ 45 మందికి గానూ 33 మంది సత్తా చాటారు.73 శాతం ఉత్తీర్ణత సాధించారు.