నవతెలంగాణ - అశ్వారావుపేట
వ్యాధి ఏదైనా స్థానికంగా ప్రధమ చికిత్స కీలకం అని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ మారుతి బాబు గౌడ్ అన్నారు.ముఖ్యం మూర్చ వ్యాధిలో ఫిట్స్ సంభవించినపుడు కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండి సకాలంలో ప్రధమ చికిత్స అందించి నైపుణ్యం గల వైద్యుని వద్దకు చేర్చాలని గ్రామీణ వైద్యులకు సూచించారు. శుక్రవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో డాక్టర్స్ డే పురస్కరించుకుని జీవన శ్రీ ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయి గ్రామీణ వైద్యులకు పలు వ్యాధులు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సీనియర్ వైద్యులను సన్మానించారు.ఇందులో డాక్టర్ సందీప్,పూర్ణ చంద్,జగదీష్,కిరణ్ లు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm