గతంలో ఇందిరమ్మ ఇస్తే ఇందిరానగర్ కాలనీ ఏర్పడింది
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇస్తే వైయస్ కాలనీ ఏర్పడింది,
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఆ కాలనీ పేరు ఇందిరానగర్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో గరీబోళ్లకు ఇండ్లు మంజూరు చేయగా ఆ కాలనీ పేరు వైయస్ పేరు కాలనీకి పెట్టుకున్నారు బీద ప్రజలకు ఎలాంటి సేవలు అందించిన అలాంటి నాయకులను గరీబోళ్ళు మరువరు. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగుతుంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గరీబోళ్లకు ఇండ్లు లభించడం లేదని.. నిర్మించి ఇవ్వడం అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రి హయాంలో ఇండ్లు కట్టిస్తే ప్రజలు ఆ కాలనీ పేరు కెసిఆర్ కాలనీగా పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏండ్ల తరబడి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు కోసం గరీబోళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇల్లు లేని పేద బీదవాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇస్తే కొత్త కాలనీలు కేసీఆర్ కాలనీలుగా ఏర్పడి అవకాశాలు ఉంటాయని చర్చ బీద ప్రజల్లో వినబడుతున్నది. మద్నూర్ మండల కేంద్రంలో అనేకమంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు. అలాంటివారికి ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ముఖ్యమంత్రి గరీబోళ్ల కోసం డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం పథకం తీసుకువచ్చారు ఆ పథకం నిరుపేదలకు అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో బీద వాళ్లకు కాలనీలు ఏర్పాటు చేసి కేసీఆర్ కాలనీలుగా తీర్చిదిద్దాలని నిరుపేద ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Jul,2022 03:07PM