నవతెలంగాణ కంటేశ్వర్
భవిష్యత్ తరాలకు మనం ఇవ్వవలసింది ప్రకృతి సిద్దమైన మట్టియే కానీ ఆస్తులు అంతస్తులు కాదని మా పల్లే చారిటేబుల్ ట్రస్ట్ నిర్వాహకులు నర్సింహారెడ్డి అన్నారు. జై శ్రీమన్నారాయన సేవ్ సాయిల్ కార్యక్రమం చేస్తూ దేశ వ్యాప్తంగా బైక్ రైడ్ చేస్తున్న సద్గురు జగ్గీ వాసుదేవగారి శిష్య బృందం ప్రెసిడెన్సి విద్యార్థులచే ప్రకృతి సేద్యం లో భాగంగా వరి నాట్లు వేయించే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవ్ సాయిల్లి కార్యక్రమ నిర్వాహకులు స్నేహిత్ మాట్లాడుతూ.. సద్గురు జగ్గీ వాసుదేవ్ బాబు ప్రపంచ వ్యాప్తంగా బైక్ పై ప్రయాణం చేస్తు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన, చెట్లు పెంచడం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అదే కార్యక్రమాన్ని మా పల్లే ట్రస్ట్ వారు ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారని తెలుసుకొని వచ్చామని అన్నారు. నర్సింహ రెడ్డి కృషి, నర్సింగపల్లి గ్రామస్తుల కృషి చాలా గొప్పది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొక అతిథి ప్రెసిడెన్సి విద్యాసంస్థల అధిపతి శమంత రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల చేత ఇంత చిన్న వయసులోనే వరి నాట్లు వేయించడం వలన వారికి ప్రతీ అన్నపు మెతుకు విలువ తెలుసొస్తుందని అన్నారు. మా పల్లే ట్రస్ట్ వారు ఎటువంటి రసాయనాలు వాడకుండా గోఆదారిత ప్రకృతి సేద్యం చెయ్యడంతో అటు మనుషులకు ఇటు మట్టికి మేలు చేస్తున్నారని అన్నారు. శ్రీ మాన్ నర్సింహ రెడ్డి వరిధాన్యాల పై రాసిన పాటను ప్రెసిడెన్సీ విద్యార్థుల పై చిత్రికరించారు. ఈ కార్యక్రమంలో నర్సింహ రెడ్డి తో పాటు, శమంత రెడ్డి, ఎంపీటీసీ రాములు, రవిందర్ యాదవ్, నరాల సుధాకర్, ప్రసాద్, రాజేశ్వర్, గంగారెడ్డ్, అశోక్, నరేష్, రవి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Jul,2022 03:31PM