నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ వివాహిత అదృశ్యమైనట్టు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయినాథ్ ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీ కు చెందిన రమై మాధవ్ రావు భార్య అయిన జిల్ఫికర్ దీక్ష , వయస్సు 20 సంవత్సరాలు, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తేదీ 27.06.2022 న మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లిపోయింది. శనివారం వరకు తిరిగి రాకపోవడంతో రాత్రి భర్త మాధవ్ రావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అప్పటివరకు బంధువుల ఇండ్లలో అంతటా వెతికినా ఎక్కడ ఆచూకీ దొరకలేదని భర్త చెప్పాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సాయినాథ్ తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Jul,2022 03:53PM