నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయం ఇటు మహారాష్ట్రకు అటు కర్ణాటక కు పూర్తిగా సరిహద్దులో ఉంది. ఈ ఆలయం మూడు రాష్ట్రాల భక్తులతో ప్రఖ్యాత గాంచింది. ఈ ఆలయాన్ని ఆదివారం మద్నూర్ మండల నివాసులు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సందర్శించి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి అరవింద్ మహారాజ్ ఎంపీ బీబీ పాటిల్ తో ప్రత్యేక పూజలు జరిపించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm