నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని సిర్పూర్ గ్రామ నివాసులు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆదివారం తన మనుమరాలును శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆ మనుమరాలు ఎంపీ బీబీ పాటిల్ అన్న హనుమంతరావు పాటిల్ కూతురి కూతురు. మనమరాలు వైద్యులుగా ఇటీవల మద్నూర్ మండలంలోని డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధ్యతలు చేపట్టారు.
మహారాష్ట్రలోని దేగ్లూర్ పట్టణంలో నాందేడ్ జిల్లా కేంద్రంలో శుభ కార్యక్రమాలకు వెళ్తూ ఆదివారం బిచ్కుంద మండలంలోని చెట్లూరు గ్రామాన్ని సందర్శించి మనుమరాలికి సత్కరించడంతో ఆ కుటుంబ సభ్యులు ఎంపీ బీబీ పాటిల్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఎంపీ వెంట అన్న కుమారుడు మండలంలోని డోంగ్లి సింగిల్ విండో చైర్మన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Jul,2022 04:44PM