నవతెలంగాణ మద్నూర్
తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా సరిహద్దులో గల దేగ్లూర్ పట్టణంలో ఆదివారం జరిగిన దేగులూర్ ఎమ్మెల్యే జితేష్ అంతాపూర్ కర్ పెండ్లికి తెలంగాణలోని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు. దెగ్లూరు ఎమ్మెల్యే జితేష్ అంతపూర్ కర్ ను కలిసి ఆశీర్వాదాలు తెలియజేశారు. వివాహానికి హాజరైన ఎంపీ బీబీ పాటిల్ కు దేగ్లూర్ ఎమ్మెల్యే జితేష్ అంతపూర్ కర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ వెంట ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ రామ్ పటేల్, ప్రజాప్రతినిధులు, పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm