అంత్యక్రియలలో పాల్గొన్న రాష్ట్ర అటవీ దేవాదాయ, న్యాయ శాఖ ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు
నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని .మాజీ ఎంపీ ప్రముఖ న్యాయవాది పండిత్ నారాయణ రెడ్డి సతీమణి ముస్కు పద్మావతి హోప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు మరణించారు. అయితే మధ్యాహ్నం 2.30 గంటలకు డిచపల్లి మండలం ధర్మారం( బి)గ్రామంలో కృషి దర్శన్ కేంద్రంలో పద్మావతి అంత్యక్రియలు జరిగాయి. ఖాళీలవాడి లో పద్మావతి భౌతికఖాయానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సతీమణి విజయమ్మ తో పాటు కుటుంబ సభ్యులు కలిసి నివాళులర్పించారు. దివంగత మాజీమంత్రి పద్మావతి ల కుమారుడు ముస్కు ఆరున్రెడ్డి, కుతురులు నలినిరావు, శీలరెడ్డి లను ఓదార్చరూ. అనంతరం నిజామాబాద్ నుండి ధర్మారం లోని కృషి దర్శన్ కేంద్రం వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన అంత్యక్రియలో మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి2 వతేది మాజీ ఎంపీ నారాయణరెడ్డి మరణించిన జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు. ఆయన సమాధి పక్కనే పద్మావతి అంత్యక్రియలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాదులు డాక్టర్స్ వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Jul,2022 04:51PM