నవతెలంగాణ-భిక్కనూర్
మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ బాణాల అమృత రెడ్డికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ గత మూడు రోజుల క్రితం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో జరిగింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదివారం నిమ్స్ ఆస్పత్రిలో బాణాల అమృత రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా అమృత రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కష్టకాలంలో ఆదుకున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు రుణపడి ఉంటామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm