నవతెలంగాణ-భిక్కనూర్
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు.. జిల్లా వైద్యాధికారులు ప్రతి నెలా ప్రభుత్వ ఆస్పత్రిలో నిద్ర చేయాలని సూచించడంతో శనివారం రాత్రి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిద్ర చేశారు. అంతకు ముందు రాత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవమైన మహిళకు కేసీఆర్ కిట్టు ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో సుఖ ప్రసవాలు పెరగడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపర్వైజర్ షరీఫ్, పి హెచ్ ఎన్ జానాబాయి, స్టాఫ్ నర్స్ చైతన్య, విజయ, ఏఎన్ఎంలు సతీష్, శ్యామల,తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm