నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రానికి చెందిన 1989 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మండల కేంద్ర శివారులోని మాసుపల్లి పోచమ్మ ఆలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తాము చేస్తున్న పనులను, వారు ఏ రంగాల్లో రాణిస్తున్నారో వివరించుకున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇకనుండి పూర్వ విద్యార్థులకు ఏ ఆపద వచ్చినా ప్రతి ఒక్కరు స్పందించాలని నిర్ణయించు కున్నారు.అనంతరం తోటి విద్యార్థి అయిన నంద రమేష్ మాజీ జెడ్పీటీసీగా, ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేస్తున్నందుకు పూర్వవిద్యార్ధులు ఘనంగా సన్మానించారు.
Mon Jan 19, 2015 06:51 pm