నవతెలంగాణ కంటేశ్వర్
రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 2021 - 22 సంవత్సరమునకు చేసిన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని రోటరీ జిల్లా 3150 2021-22 గవర్నర్ కే ప్రభాకర్ ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించినటువంటి ధూంధాం అవార్డుల కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకమైన అవార్డులను సాధించింది. తెలంగాణ రీజియన్ పరిధిలో ఉత్తమ క్లబ్, ఉత్తమ సెక్రటరీ గా శ్రీకాంత్ జవహర్, అలాగే ఈ కార్యక్రమాలన్నీ అధ్యక్షులు గట్టు జ్ఞాన ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అక్షరాస్యత పై నిర్వహించిన కార్యక్రమాలు గాను ఉత్తమ అవార్డు, అలాగే ఒకేషనల్ సర్వీస్ లలో నిర్వహించిన కార్యక్రమాల దృష్ట్యా ఉత్తమ అవార్డు, వైద్యరంగంపై నిర్వహించిన కార్యక్రమాలకు గాను ఉత్తమ అవార్డు, మీడియా మిత్రుల సహకారంతో తాము ఏర్పాటు చేసుకున్న పబ్లిక్ ఇమేజ్ అవార్డును కూడా కైవసం చేసుకుంది నిజామాబాద్. వీటితోపాటు ప్రశంసా పత్రాలను కూడా వివిధ అంశాలలో ఇవ్వడం జరిగిందని 2021-22గట్టు జ్ఞాన ప్రకాష్ అధ్యక్షులు తెలిపారు. అవార్డుల కార్యక్రమంలో 2021 22 సంవత్సర అధ్యక్ష కార్యదర్శులు గట్టు జ్ఞాన ప్రకాష్, శ్రీకాంత్ జవహర్, అలాగే మాజీ అధ్యక్షులు ఆకుల అశోక్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Jul,2022 07:30PM