- ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-భిక్కనూర్
ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సును ఢీ కొట్టినలో యువకుడు మరణించిన సంఘటన ఆదివారం మండలంలోని 44వ జాతీయ రహదారిపై స్థానిక టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం టోల్ ప్లాజా వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్లు దగ్గర నెమ్మదిగా వెళ్లగా వెనక నుండి అతి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు నిర్మల్ డిపోకు చెందిన రాజధాని ద్విచక్ర వాహనాన్ని వెనకనుంచి ఢీకొట్టింది. వాహనం పై ఉన్న అజిత్ (26) అక్కడికక్కడే మరణించగా, వెనకాల ఉన్న మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 44వ జాతీయ రహదారి అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన వ్యక్తిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరణించిన యువకుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసికి చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ గౌడ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Jul,2022 11:12PM