-తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన.
నవతెలంగాణ చివ్వేంల
రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని,డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు జూలకంటి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు కంచర్ల లింగారెడ్డి డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా పేయిర్ ప్రైస్ డీలర్స్ ఫెడరేషన్. తెలంగాణ రాష్ట్ర నేషన్ డీలర్ సంక్షేమ సంఘం పిలుపుమేరకు,రేషన్ డీలర్లు న్యాయమైన హక్కుల సాధనకై
సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు జూలకంటి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు కంచర్ల లింగారెడ్డిలు మాట్లాడుతు రేషన్ డీలర్లకు కమిషన్ (440) నాలుగు వందల నలభై రూపాయలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్లు బచ్చలి కన్నయ్య, గుగులోతు అనిల్, గుగులోతు చంద్రశేఖర్, నీలమ్మ, శైలజ, శ్రీను, వీరన్న, తదితరులు పాల్గొన్నారు..
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Jul,2022 04:02PM