నవతెలంగాణ కంటేశ్వర్
రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో విప్లవకారుడు స్వతంత్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి ని ఘనంగా విద్యార్థుల మధ్య సోమవారం జరిపారు. చంద్రశేఖర్ నగర్ కాలనీ నందు గల కుమార్ గల్లి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపన్యాస వ్యాసరచన పోటీలను నిర్వహిస్తూ ఘనంగా జరుపుకోవడం జరిగింది అని కార్యదర్శి డాక్టర్ ఆకుల విశాల్ తెలిపారు. సీతారామరాజు యవ్వనంలోని ధైర్య సాహసాలతో ఆంగ్లేయులపై పోరాటపటిమను కనబరిచి వారికి వ్యతిరేకంగా కొట్లాడడం జరిగినది అన్నారు. నేటి యువత మరియు విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ధైర్యసహసాలకు నాయకత్వ లక్షణాలకు అలవర్చుకోవాలని, అల్లూరి ని స్మరించుకోవడం ముఖ్యమని తెలిపారు. ఇంతే కాకుండా చక్కటి విషయాలు , స్వతంత్ర సమరయోధుల విషయాలు ప్రతి పాఠశాలలో బోధించడం చాలా అవసరమని అన్నారు. దీన్ని వలన విద్యార్థులకు చిన్న స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలు మరియు ప్రేరణలు అలవర్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇన్చార్జ్ అధ్యక్షులు వి శ్రీనివాసరావు ప్రాజెక్టు చైర్మన్ రాజకుమార్ సుబేదార్, కోశాధికారి డాక్టర్ హరిష్ స్వామి, డాక్టర్ నవీన్ మాలు తులసీదాస్ పటేల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మరియు సిబ్బంది చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Jul,2022 04:38PM