కాటాపూర్ పల్లె దవఖాన వైద్యాధికారి డాక్టర్ స్వప్న
నవతెలంగాణ- తాడ్వాయి
వర్షాకాలం సమీపిస్తుండడంతో..సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాటాపూర్ పల్లె ధవఖాన (సబ్ సెంటర్) వైద్యాధికారి డాక్టర్ స్వప్న తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని కాటాపూర్ పీహెచ్సీ పరిధిలోని ఐలాపూర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 60 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమల పెరుగుదలకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. ఈగలు దోమలు వ్యాప్తి చెంది మలేరియా టైఫాయిడ్ కలరా మొదలైన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. జలుబు, జ్వరం, పొడి దగ్గు లక్షణాలుంటే... వెంటనే ఐసోలేట్ అయి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని కోరారు. పాజిటివ్ అని నిర్ధారణ అయితే వైద్యుల సూచనమేరకు మందులు వాడాలని సూచించారు. ప్రత్యేక క్యాంపులు గ్రామాల్లో స్కూళ్ల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.7 నుండి 1 శాతానికి చేరుకున్నదని .. కరోనా పాండమిక్ నుంచి ఎండమిక్ దశకు చేరుకున్నదని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని, వ్యాక్సినేషన్ పెద్ద మొత్తంలో జరగటమే అందుకు కారణమన్నారు. ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు అందరూ విధిగా ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్ పిహెచ్సి హెచ్ ఈ ఓ బి సమ్మయ్య, హెచ్ వి సరస్వతి, హెల్త్ అసిస్టెంట్లు ముత్తయ్య, ఏఎన్ఎం లు గౌరమ్మ, నవలోక, ఆశ కవిత తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Jul,2022 04:41PM