బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్
నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ సాయుధ పోరాట యధుడు దొడ్డి కొమరయ్య ఆశయ సాధన కోసం దళిత బహుజనులు ఉద్యమించాలి అని బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా కడివెండి గ్రామంలో 1946 జులై 4న విసునూర్ దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి గుండాల తుపాకీ గుండ్లకు నేలకొరిగిన దొడ్డి కొమరయ్య ఆశించిన భూమి, భుక్తి దళిత బహుజన విముక్తి ఇంకా జరగలేదన్నారు. సోమవారం వినాయక్ నగర్ లో గల అమరవీరుల పార్క్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సమాజంలో 93% iన్న దళిత బహుజన ప్రజలకు రాజ్యాధికారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ఆశయం నేరవేరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజాంను ప్రభుత్వానికి సామంత రాజులుగా పనిచేసిన ఆధిపత్య దోపిడి వర్గాలు .. వృత్తి కులాలైన దళిత బహుజన ప్రజలచే వెట్టిచాకిరి చేయిస్తే ఆ ఎట్టిచాకిరి వ్యతిరేకంగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు తిరుగుబాటు చేసారన్నారు. ఆ తిరుగుబాటు వారసత్వం స్పూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కుర్మ యువజ సంఘం జిల్లా అద్యక్షులు దండు శ్రీ కాంత్, ఎంసిపిఐయు జిల్లా నాయకులు మేత్రి రాజశేఖర్,బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి పీట్ల శ్రీ నివాస్ , బిసి సంఘం జిల్లా నాయకులు రాంమోహన్ చారి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Jul,2022 05:04PM