వర్షాకాలం వస్తే నాలుగు నెలలు నానా అవస్థలే
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని లింబూర్ గ్రామపంచాయతీ పరిధిలోకి వచ్చే వాడి గ్రామ ప్రజల ఇబ్బందులు పట్టించుకునేది ఎవరని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే నాలుగు నెలలు నానా అవస్థలు పడవలసిందే. లింబూర్ గ్రామం నుండి వాడి గ్రామం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యలో చిన్న వాగు ఉంది. వర్షం పడితే రోడ్డు బురద మయం అవుతుంది. వాడి గ్రామస్తులు ఏండ్ల తరబడి బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. ఇరు గ్రామాల మధ్య వాగు పైన వంతెన నిర్మించాలని కోరుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ తలరాత మార్చడం లేదని వాడి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో గత రెండు మూడు రోజుల నుండి వర్షాలు కురిసాయి. కురిసిన వర్షానికి రోడ్డు మొత్తం బురదమయం అయింది. గ్రామం నుండి లింబూర్ కు రావాలన్నా.. లింబూర్ నుండి వాడికి వెళ్లాలన్నా.. ఇబ్బందే. ఈ గ్రామానికి ఏ వాహనం వెళ్లలేదు ఎందుకంటే వర్షం పడితే చాలు రోడ్డు అంతా బురదమయం. గ్రామస్తుల సమస్యను పట్టించుకునే నాధుడే లేరని తమ విన్నపం ఏనాడు పూర్తి అవుతుందోనని ఆ గ్రామ ప్రజలు నాన అవస్థలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవస్థలు ఎదుర్కొనే గ్రామ ప్రజల పట్ల ప్రభుత్వం కల్పించుకొని రోడ్డు సౌకర్యం పూర్తిచేయాలని కోరుతున్నారు. రాత్రింబవళ్లు వెళ్లాలంటే రోడ్డు పరిస్థితి బాగాలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడుస్తోంది కాన్నీ గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు ఏర్పడకపోవడంతో దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉందో వాడి గ్రామస్తుల అవస్థలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటుంటే ఇది చేశాం అది చేశామంటూ గొప్పలు చెప్పుకునే నాయకులు వాడి గ్రామస్తుల అవస్థలు పరిశీలిస్తే అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని ఆ గ్రామస్తులు అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Jul,2022 06:49PM