తాహసిల్దార్ వీర్ సింగ్
నవతెలంగాణ నవీపేట్
అందరి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తాహసిల్దార్ వీర్ సింగ్ అన్నారు. మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ఆయనను శాలువ పుష్పగుచ్చంతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి జిల్లాలోనే అభివృద్ధిలో మండలాన్ని అగ్రస్థానంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే విడతల వారీగా సమస్యలను పరిష్కరించుకుందామని సర్పంచ్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోపాలకృష్ణ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఏ టి ఎస్ శ్రీనివాస్, రాము, నీలేష్ కుమార్, శ్రీనివాస్, షకీల్, కిషన్ రావు, ప్రవీణ్ కుమార్, మహిపాల్, రవి, బాబు, సతీష్ తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Jul,2022 07:14PM