నవతెలంగాణ-ధర్మసాగర్
విద్యార్థులు పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏది లేదని బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అమెరికా ఎన్జీవోస్ ఫౌండర్ అండ్ చైర్మెన్ షేక్ చాంద్ పాషా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో 334 మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా డైరీలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులవల్లే ఉన్నత శిఖరాలు చేరుకుంటారని,పట్టుదలతో చదివి,దేశ భవిష్యత్తుకు తోడ్పడాలని అన్నారు. విద్యార్థిని,విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలలో తరగతి గదిలో జరిగే అంశాలను, ముఖ్యమైన సంఘటనలను డైరీలో ప్రతిరోజు పొందుపరుచుకోవాలని సూచించారు. దీంతో రానున్న రోజుల్లో మంచి విజ్ఞాన పరిజ్ఞానంతో పాట,చదవాలని ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుమాదేవి,ఎస్ఎంసి చైర్మన్ సదయ్య, టీఎస్ ప్రధానోపాధ్యాయులు శివరతన్ సింగ్,ఎస్ఎంసి సభ్యులు,మరియు ఉపాధ్యాయులు,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Jul,2022 07:16PM