నవతెలంగాణ కంటేశ్వర్
టాస్క్ ఫోర్స్ టీమ్ దాడి చేయగా భారీ మొత్తంలో నిషేధిత గుట్కా, పొగాకు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి సుమారు రెండు లక్షల విలువ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు వెల్లడించారు. టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్ లో కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా/పోగాకు డంప్ ఉన్నదన్న నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్.నాగరాజు, ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్ మరియు వారి సిబ్బంది టాస్క్ ఫోర్స్ తనీఖీ చేశారు. ఈ మేరకు సుమారు రూ॥ 2,00,000/- రూపాయలు విలువ గల గుట్కా / పొగాకు స్వాధీనం చేసుకొని టౌన్ 4 పోలీస్ స్టేషన్ అప్పగించడం జరిగిందన్నారు. పట్టుబడిన నిందితుని వివరాలు ఇలా ఉన్నాయి. భూమ్పల్లి రాజేందర్ తండ్రిపేరు: విశ్వనాధమ్, వయసు:50. కులం వైశ్య, వృత్తి: బిజినెస్, ఇంటినెంబర్ 1-1-356 / సి, వినాయక్ నగర్, నిజామాబాద్ అని తెలిపారు.
సిబ్బంది స్వాధీనం చేసుకున్నవి అంబర్ 60 ప్యాకేట్లు, ఎక్స్ ఎల్-01 -119 ప్యాకేట్లు, ఎస్.ఆర్ 01 - 05 ప్యాకేట్లు, విమల్ 98 ప్యాకేట్లు, రాజ్ నివాస్ - 173 ప్యాకేట్లు, వి1 టోబాకో - 01 ప్యాకేటు, సాగర్ 59 ప్యాకేట్లు, జండా జర్ధా - 20 బాక్సులు, రాణి - 3 ప్యాకేట్లు, సూర్య చాప్ తోటా - 1 ప్యాకేటు, పాన్ బహార్ 3 ప్యాకేట్లు, రకాడా 30 పౌచెస్ తదితర వస్తువులు. వాటిని నాలుగో పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న పోలీసు బృందాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Jul,2022 07:59PM