నవ తెలంగాణ-రాయపోల్
చుట్టుపక్కల గ్రామాల నుండి పాఠశాల కాలినడకన నడిచి వచ్చే విద్యార్థుల కోసం ఉచితంగా బస్ పాసులు పంపిణీ చేయడం జరిగిందని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇప్ప దయాకర్ అన్నారు. సోమవారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్ పాసులు గ్రామ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయపోల్ మండల కేంద్రానికి ఉన్నత చదువులు చదువుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది విద్యార్థులు కాలినడకన వస్తున్నారని ప్రతిరోజు ఉదయం సాయంత్రం నడిచి రావడం వల్ల విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుందని, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు150 మంది విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందజేయడం జరిగిందన్నారు. లింగారెడ్డి పల్లి, చిన్న మాసాన్ పల్లి, కృష్ణా సాగర్, కొత్తపల్లి, తిమ్మక్ పల్లి విద్యార్థులకు బస్ పాసులు అందజేయడం జరిగింది. విద్యార్థులు సమయం వృధా కాకుండా సకాలంలో పాఠశాలకు చేరుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి వారికి తోడుపాటు అందించాలని బస్ పాసులు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం నుండి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ఎలాంటి వ్యాధి లక్షణాలు ఉన్న పరీక్షలు చేసి శస్త్ర చికిత్సలు అవసరం ఉంటే కార్పొరేట్ స్థాయి ఆసుపత్రికి పంపించి ఉచిత వైద్యం అందజేస్తారు. అలాగే మధ్యాహ్న భోజనం పరిశీలించి నాణ్యతలో రాజీ పడవద్దని మధ్యాహ్న భోజన నిర్వహకులకు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సన్న బియ్యం తోటి నాణ్యమైన భోజనం పెట్టాలని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని నాణ్యతలో రాజీ పడకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, ఆర్టీసీ సిబ్బంది జయందేర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు రామచంద్ర గౌడ్, మంజూర్, తిరుమలాపూర్ నాగరాజు, తుప్పతీ ప్రవీణ్, వీరనగర్ స్వామి, కృష్ణ, రాజు, సిఆర్పి కుమార్ స్వామి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Jul,2022 10:42AM