నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన ఆరేపల్లి శ్రీనివాస్ గతకొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చేయి విరిగి పనిచేయలేని స్థితిలో ఉండడంతో, ఆపరేషన్ ఖర్చుల కోసం అతని కుటుంబం సహాయం అర్థించగా శాలివాహన (కుమ్మరి) వెల్ఫేర్ ట్రస్ట్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో అతని కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం 10,516 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ నిజామాబాద్ చైర్మన్ రఘురాజ్ ,సభ్యులు ఏనుగంటి గంగాధర్, ప్రసాద్, సంతోష్, పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm