నవతెలంగాణ-కోహెడ
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన వారిని గుర్తించి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఎంపీడీవో దెవేందర్‌కు శుక్రవారం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు గోవిందు వెంకటేశం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో చిన్న చిన్న ఉద్యోగాలను, వ్యాపారాలను వదులుకొని రాష్ట్ర సాధనకు ఉద్యమంలో పాల్గోని కీలకపాత్ర వహించిన వారిని గుర్తించాలన్నారు. అలాగే సంక్షేమ పథకాలలో డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, దళితబంధు, బీసీ రుణాలలో 20 శాతం కోట కేటాయించాలని వినతిపత్రంలో పేర్కోన్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm