నవతెలంగాణ-కోహెడ
తంగళ్ళపల్లి పెద్దవాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి గతంలో 8 కోట్ల 75 లక్షలు మంజూరి కాగా ప్రస్తుతం 7 కోట్ల 63 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కాజ్ వే నిర్మాణంతో సింగరాయ ప్రాజెక్ట్‌కు, సమ్మక్క సారక్క జాతర సమయంలో రహదారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు గ్రామస్థులకు, రైతులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో నీటి పారుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని హర్షం వ్యక్తం చేశారు. నిధుల మంజూరికి ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి హరీష్‌రావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm