- ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
నవతెలంగాణ-ఇల్లంతకుంట
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందని స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని రేపాక, ఆరేపల్లె, కేశన్నపల్లె, ముస్కానిపేట, పత్తికుంట పల్లె, తాళ్లపెల్లి, గాలిపెల్లి, నర్సక్కపేట, పొత్తూర్, కందికట్కూర్, వంతడుపుల గ్రామాలలో శుక్రవారం లబ్ధిదారులకు సుమారు 28 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మిచెక్కులను నేరుగా పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలు దేశానికి ఆదర్శం అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నదే కేసీఆర్ లక్ష్యం అన్నారు. కోటి రతనాల వీణ నా తెలంగాణ అని కీర్తించిన కవుల మాటలను నిజం చేస్తూ కేసీఆర్ తెలంగాణను కోటి ఎకరాల సాగు నీరు అందిస్తున్న మనసున్న మహారాజు అన్నారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ని అందిస్తున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు. ప్రజలందరికీ ఇంటింటికీ మంచినీరు అందిస్తున్న ఘతన మన రాష్ట్రానిదేనని అన్నారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వమని, ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పొత్తూర్ గ్రామములో నిర్మిస్తున్న మురికి కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వేణు, ఎంపిపి రమణారెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ సంజీవ్, పాక్స్ చైర్మన్ లు తిరుపతి రెడ్డి, ఆనంతరెడ్డి, పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Nov,2022 07:08PM