నవతెలంగాణ-కంటేశ్వర్
ఏఐపిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ లోని జి జి కళాశాల ప్రాంగణంలో ప్రయివేటు కార్పొరేట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 21 ఈనెల 22, 23వ తేదీలలో క్రికెట్ టోర్నమెంటును నిర్వహణ చేయడం జరిగింది. ఈ మెంట్లో విజేతలుగా నిలిచిన విన్నర్స్ రన్నర్స్ కు శుక్రవారం కోట గల్లీలోని డాక్టర్ దేవదాస్ భవన్ కమ్యూనిటీ హాల్లో బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజు, లయన్ సాహితీ చైర్మన్ సుజాత, హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులు క్రీడల్లో చురుకుగా ఉండాలని అంతర్జాతీయ జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా ఉండేలా ఉండాలని క్రీడా విద్యార్థులను ఉద్దేశించి మోటివేషన్ చేయడం జరిగింది.
అదేవిధంగా ఆరోగ్యానికి ముఖ్యం వ్యాయామం క్రీడలు అని ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలకు ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి జిల్లా సూపరిడెంట్ ప్రతిమ రాజు విద్యార్థులకు ఎన్నో మంచి విషయాలను తమ విద్యార్థి దశ ఎంత ముఖ్యమైందని ఇలాంటి వ్యసనాలకు తావివ్వకుండా మంచి క్రీడా స్ఫూర్తితో ఆడి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని సూచించడం జరిగింది. అనంతరం ఈ టోర్నమెంట్లో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ఎస్సార్ రెసిడెన్షియల్ జట్టుకు తమ బహుమతిని ఆ జట్టులో ఉన్న సభ్యులందరికీ పాల్గొన్న మెమొంటోస్ని అందజేయడం జరిగింది. ఈ టోర్నీలో రన్నర్ గా నిలిచినటువంటి పాఠశాల జట్టుకు ద్వితీయ బహుమతిని అందజేసి జట్టులో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి మెమొంటో అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్, తస్మా లయన్ సహారా ప్రవీణ్ సార్, జిల్లా కార్యదర్శి జ్వాల తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అఖిలభారత దక్షిణ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలా మాట్లాడుతూ నిజామాబాద్ లో జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ కి విద్యార్థి సంఘం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శఅదే విధంగా మ్యాచ్కు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ చూసుకుంటున్నట్లు తెలిపారు. ఈ యొక్క విద్యార్థి సంఘం మ్యాజిక్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు ప్రోత్సహించినటువంటి క్రీడా సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నరసయ్యకి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్కి విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి జ్వాల విప్లవ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి ఎంతగా చురుకుగానో సహకరిస్తూ జిల్లా కమిటీకి అండదండలుగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యాసంస్థలకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Nov,2022 07:13PM