నవతెలంగాణ-నవీపేట్
రాజకీయం ఈరోజుల్లో అస్సలు బాగాలేదని విద్యార్థులు రాజకీయానికి ఆకర్షితులు కావద్దని నిజామాబాద్ జెడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నెట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఐదవ సబ్ జూనియర్ నెట్ బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్మన్ దాదన్న గారి విటల్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఆటల్లో రాణిస్తూనే డాక్టర్, ఇంజనీర్, పోలీస్ లాంటి వృత్తులపై ఎక్కువ దృష్టి పెట్టాలని కానీ 20% మాత్రమే రాజకీయాలపై ఆకర్షణ ఉండాలని సూచించారు. రాష్ట్రస్థాయి క్రీడలకు నవీపేట్ ఆతిథ్యం ఇవ్వడం అభినందనీయమని క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.
అలాగే మండల కేంద్రంలో క్రీడా మైదానం మరమ్మతులకు తన నిధుల నుండి రెండు లక్షలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. క్రీడా స్ఫూర్తిని జీవితంలో అలవర్చుకుంటే జీవితం సుస్థిరంగా ఉంటుందని స్థానిక సర్పంచ్ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఏ టి ఎస్ శ్రీనివాస్ అన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ క్రీడల్లో 16 జిల్లాల నుండి 16 బాలుర జట్లు, 14 బాలికల జట్లు హాజరయ్యాయని ఎంఈఓ గణేష్ రావు తెలిపారు. ఛాంపియన్షిప్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు రవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఇందూర్ హరీష్, ఒలంపిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు విక్రమ్ ఆదిత్య, పిఆర్టియు నాయకులు మోహన్ రావు, ఎస్సై రాజారెడ్డి, ఎంపీటీసీ మీనా నవీన్ రాజ్, తాహెర్, ఉపాధ్యాయులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Nov,2022 07:19PM