నవతెలంగాణ-డిచ్ పల్లి
గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలలో ఆదాయ పెంపుదల కొరకు ఆస్తుల కొనుగోలు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు, భూమి కొనుగోలు, సూపర్ మార్కెట్ల ఏర్పాటు తదితర మార్గాల ద్వారా ఆదాయ పెంపుదల చేసుకోవడం ద్వారా సమాఖ్యలు ఆర్థికంగా బలేపేతం కావాలని డిపిఎం ఫైనాన్స్ సంధ్య, డిపిఎం ఐడి ఫైనాన్స్ శ్రీనివాస్ లు అన్నారు. శుక్రవారం ఇందల వాయి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండల మహిళా సహకార సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిపిఎం సంధ్య, శ్రీనివాస్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయేతర యంత్రపరికరాలు, వరి కోత మిషన్లు, ట్రాక్టర్ల వంటి వాటిని కొనుగోలు ద్వారా ఆదాయాన్ని పెంపుదల చేసుకోవాలని సూచించారు.
కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఓటర్ ఐడి లకు ఆధార్ కార్డు లింకు చేయాలని, వార్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టి, మ్యుజికల్ చైర్ అటాలు, మొదటి, ద్వితీయ బహుమతులు అందజేయాలని సూచించారు. గ్రామ, మండల సమాఖ్యల ఆదాయ పెంపుదల కొరకు ఆస్తుల కొనుగోలు షాపింగ్ మాల్స్ ఏర్పాటు, భూమి కొనుగోలు, సూపర్ మార్కెట్ల ఏర్పాటు తదితర మార్గాల ద్వారా ఆదాయ పెంపుదల చేసుకోవడం ద్వారా సమాఖ్య లు ఆర్థికంగా బలేపేతం కావాలని తెలిపారు. శ్రీనిధి బ్యాంకు లింకేజీ ద్వారా వచ్చే రుణాల ద్వారా జనరిక్ మెడికల్ షాపులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రిక్ ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు ఏర్పాటు కోసం రుణాలను తీసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎటిఎం సువర్ణ, సిసిలు ఉదయ్ కుమార్, గోవింద్ నాయక్, అనురాధ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, కార్యవర్గ సభ్యులు, సమైక్య సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Nov,2022 07:30PM