- త్వరలోనే పామాయిల్ పరిశ్రమ విస్తరణ పనులు పూర్తి - ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ-అశ్వారావుపేట
దమ్మపేట మండలం అప్పారావు పేట, అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ విస్తరణ పనులు త్వరలోనే పూర్తి అవుతాయని ఆయిల్ఫైడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్రెడ్డి తెలిపారు. ఇందుకు గాను రూ.80 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. గెలల దిగుబడి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు పరిశ్రమ విస్తరణ చేపట్టినట్లు వివరించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ముందుగా దమ్మపేట మండలం అప్పారావు పేట పరిశ్రమలో విస్తరణ పనుల పై కాంట్రాక్టర్లతో ఆయన సమీక్షించారు.
సకాలంలో పనులు పూర్తి చేయాలని, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సివిల్ కన్సల్టెంట్స్ యోగేందర్, నాగిరెడ్డి లను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. పనుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం లో నిర్మిస్తున్న అతిథిగృహం నిర్మాణ పనులను తనిఖీ చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అక్కడ నుండి అశ్వారావుపేట పరిశ్రమకు చేరుకుని వార్షిక మరమ్మత్తు పనులను పర్యవేక్షించారు. అదనపు పరిశ్రమ నిర్మాణం పైనా ఆయన స్థానిక అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు దృష్టి సారించామని అన్నారు. అశ్వారావుపేటలో అదనపు పరిశ్రమను నిర్మించనున్నామని, అందులో భాగంగానే విస్తరణ పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. అశ్వారావుపేట,దమ్మపేట మండలం అప్పారావు పేట పరిశ్రమల సామార్థ్యాలను పెంచుతున్నామని, అశ్వారావుపేట పరిశ్రమ గంటకు 30 టన్నుల నుండి 60 టన్నుల సామర్ధ్యం, అప్పారావు పేట ఫ్యాక్టరీ సామార్థ్యాన్ని 60 టన్నుల నుండి 90 టన్నులకు విస్తరిస్తున్నట్లు వివరించారు. పనులన్నీ సజావుగానే సాగుతున్నాయని, క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆయిల్ ఫెడ్ పీ అండ్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి,ఆయిల్ ఫెడ్ డి.ఒ ఆకుల బాలక్రిష్ణ,అప్పారావు పేట పరిశ్రమ మేనేజర్ జి.కళ్యాణ్ గౌడ్,సైట్ ఇంజినీర్ సిద్దార్థ్,ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ నాయుడు రాధాక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Nov,2022 07:34PM