నవతెలంగాణ-కోహెడ
మండలంలోని 18 సంవత్సరాలు పైబడి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తహాశీల్దార్ జావీద్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేడు, రేపు రెండు రోజులు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. బూత్ లెవల్ అధికారులు గ్రామ పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారని అర్హులైన యువతి యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పేర్కోన్నారు. గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm