నవతెలంగాణ-నవీపేట్
మండల కేంద్రంలోని అలీ సాగర్ లిఫ్ట్ కెనాల్ లో ధాన్యం లారీ అదుపు తప్పి శుక్రవారం బోల్తా పడింది. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన నలుగురు రైతుల ధాన్యం సొసైటీ ఆధ్వర్యంలో తూకం చేసేందుకు ధర్మ కాంటాకు తరలించగా అదుపు తప్పి లిఫ్ట్ కెనాల్ లో బోల్తా పడింది. సమాచారం మేరకు సొసైటీ చైర్మన్ అబ్బన్న, డైరెక్టర్లు గణేష్, శ్రీనివాస్, రాము, సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. రైతులకు ఎటువంటి నష్టం లేకుండా తడిసిన సంచులను సైతం రైస్ మిల్లుకు తరలిస్తామని తెలిపారు.