- పౌష్టికాహారం అందించడం అభినందనీయం
నవతెలంగాణ-రాయికల్
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాగి జావా బెల్లమును పంపిణీ చేయడం అభినందనీయమని సర్పంచ్ ఎడమల జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని అయోధ్య ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రతిరోజు విద్యార్థులకు శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించే రాగి జావాను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు ఊటూరి శ్రీకాంత్ జే శెట్టి రాజశేఖర్ లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థులకు ఐరన్ రక్త వృద్ధి కాల్షియంతో పాటు మంచి జ్ఞాపకశక్తి పెంపొందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ బండారి సురేష్, చౌడారపు గంగాధర్, ప్రధానోపాధ్యాయులు పొన్నం రమేష్, ఉపాధ్యాయులు విజయ్ కుమార్, రూపవతి, రాజ మల్లేశ్వరి, శోభ,రాజేశం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.