- గ్రామీణ యువత క్రీడారంగంలో రాణించాలి-డి.ఆర్.డి.ఏ పిడి వినోద్
నవతెలంగాణ-రాయికల్
గ్రామీణ యువత క్రీడారంగంలో రాణించాలని పల్లెల్లో క్రీడా ప్రాంగాణాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని డి.ఆర్.డి.ఏ పిడి వినోద్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని భూపతి పూర్ గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు స్థలం పరిశీలించారు. క్రీడా ప్రాంగణ, పాఠశాలలోని అభివృద్ధి నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉప సర్పంచ్ అన్న వేణి వేణు, ఉపాధి హామీ ఈసీ దీపిక, టిఏ.విజేశ్, కార్యదర్శి హరికృష్ణ, ప్రధానోపాధ్యాయులు కామని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm