నవతెలంగాణ-రాయికల్
బతుకమ్మ పండుగ ముగిసి సుమారు రెండు నెలలు గడుస్తున్న లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడంలో అధికారుల నిర్లక్ష్యమేలా అని బీజేపీ మండల అధ్యక్షుడు అన్నవేణి వేణు అన్నారు. శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ రాయికల్ మండల వ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం నుండి వచ్చిన చీరలను 100 శాతం ఇవ్వకుండానే వాటిని గ్రామ పంచాయతీ ల్లో పక్కన పడేశారని అన్నారు. తాను ఉపసర్పంచ్ గా ఉన్న భూపతిపూర్ గ్రామంలోనే ఇప్పటివరకు లబ్దిదారులకు చీరలు పంపిణీ కాలేదన్నారు. మండల వ్యాప్తంగా పూర్తిస్థాయిలో బతుకమ్మ చీరలు లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm