- తమకు రావలసిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు
నవతెలంగాణ-కంటేశ్వర్
ప్రజలు నమ్మి ఓ చిట్ఫండ్ కంపెనీలో డబ్బులు కట్టగా చిట్ఫండ్ కంపెనీ బోర్డు తిప్పడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని బాధితులు షేక్ ముజాహిద్, శ్రీనివాస్, శివకుమార్ రమేష్, సనత్ శ్రీనివాస్, నవీన్ తదితర బాధితులు మీడియా ముందు కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిత శ్రీ చిట్ ఫండ్స్ నిజామాబాద్ బ్రాంచ్పై చిట్ఫండ్ కంపెనీ బ్రాంచ్ ఆర్మూర్ రోడ్ లో గల కంటేశ్వర్ బైపాస్ ప్రాంతంలో ఉందని, ఈ చిట్ఫండ్ కంపెనీలో ప్రతినెల డబ్బులు జమ చేయడం జరిగిందని, తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా 18 నెలల నుండి చిట్ఫండ్ చుట్టూ తిప్పుతూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు తిప్పేసిందని తెలియడంతో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అలాగే రెండవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ప్రస్తుతం ఒక్కొక్కరికి ఎన్నో అవసరాలు ఉన్నాయని ఆస్పత్రులకు పెళ్లిళ్లకు ఇంటి ఖర్చుల అవసరానికి చిట్టి డబ్బులు కట్టినామని ఇట్టి డబ్బులు ఇవ్వకుండా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ అమాయకమైన మమ్మల్ని మోసం చేయడం సరైన కానీ వారు కూడా పట్టించుకోవడంలేదని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయినా తమకు సంబంధం లేదు అంటూ సమాధానాలు చెబుతున్నారని కన్నీరు మున్నీరయ్యారు. కావున తమయందు దయతలిచ్చి వెంటనే పోలీసు యంత్రాంగం జిల్లా అధికారులు భవిత చిట్ ఫండ్స్ ఆర్మూర్ రోడ్ బ్రాంచ్ శాఖ అధికారులపై సంసాధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారి నుండి తమకు రావలసిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 12:28PM