నవతెలంగాణ-అశ్వారావుపేట
వర్జీనియా పొగాకు సాగులో నాణ్యత,నియంత్రణ పాటించాలని జంగారెడ్డిగూడెం రెండో వేలం కేంద్రం సూపరింటెండెంట్ మహేశ్ సూచించారు. మండల పరిధిలోని ఊట్లపల్లి లో వర్జీనియా పొగాకు సాగుపై శుక్రవారం రైతులకు అవగాహన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. నాణ్యమైన పంట దిగుబడి కోసం సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని అన్నారు. బోర్డు సూచనల మేరకు బేరన్ పొగాకు నాలుగు ఎకరాలు మాత్రమే సాగు చేయాలని అన్నారు. జంగారెడ్డిగూడెం రెండో వేలం కేంద్రం పరిధిలో అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లో సుమారు 625 బ్యారన్లు ఉన్నాయని తెలిపారు. వేలం కేంద్రం ప్రతినిధి పార్వతి, కొనుగోలు కేంద్రం ప్రతినిధులు రవి, నాగేంద్రబాబుతో పాటు అశ్వారావుపేట, వేదాంతపురం, ఉట్లపల్లి, నల్లబాడు రైతులు సుంకపల్లి శంకర్, కోడూరి నాగు, గడ్డం వెంకటేశ్వర్లు, బ్రహ్మజీ, తోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 12:30PM