నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని లక్నవరం చెరువులో మత్స్య కార్మికుల అభివృద్ధి కోసం మంచినీటి రొయ్యలను విడుదల చేసినట్లు లక్నవరం చెరువు పత్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న తెలిపారు. శనివారం లక్నవరం చెరువు ప్రాంతంలో మంచినీటి రొయ్యల విడుదల సందర్భంగా వెంకన్న మాట్లాడారు. మంచినీటి రొయ్యలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున మత్స్య కార్మికుల అభివృద్ధి కోసం రొయ్యల పెంపకం ఉపయోగపడుతున్నందున ప్రభుత్వం వీటిని విడుదల చేస్తుందని అన్నారు. ప్రస్తుతం లక్నవరం చెరువులో నాలుగు లక్షల 58500 మంచినీటి రొయ్య పిల్లలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్య పారిశ్రామిక సహకార సంఘం చల్వాయి ,కార్యదర్శి యాట రఘు, డైరెక్టర్స్ మరియు సభ్యులు, మత్స్య శాఖ డీడీ హన్మంతరావు డి యఫ్ఓ శ్రీపతి, యఫ్ యఫ్ ఓ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 04:08PM