నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సమన్వయంగా నిర్వహించిన ఉమెన్ హెల్ప్ డెస్క్ 2 రోజు శిక్షణ కార్యాక్రమం శనివారం నిజామాబాద్ జిల్లాలోని న్యూ అంబేద్కర్భవన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా కామారెడ్డి జిల్లా సూపరింటెండెంటు ఆఫ్ పోలీస్ బి. శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఉమెన్ హెల్ప్ డెస్క్ సంబంధించిన పుస్తకమును ఆవిష్కరించారు. అనంతరం సూపరింటెండెంటు ఆఫ్ పోలీస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలోరాణిస్తున్నారని, ఎక్కడనైతే మహిళలను గౌరవించడం జరుగుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు బాగా చదువుకోవాలని అప్పుడే సమాజంలో జరిగే నేరాలపై అవగాహణ వస్తుందని, అందుకోసం ప్రతీ ఇంట్లో మహిళల చదువుకు సహకారం అందించాలని అన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ యందు మహిళా సహాయ కేంద్రము ద్వారా మహిళలపై జరిగే నేరాల నియంత్రణ కోసం ఉంటుందని, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎల్లప్పుడు ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడాలని, మహిళలకు సంబంధించిన కేసులను చాలా సున్నితంగా తీసుకోవాలని, ప్రతీ ఒక్కరు నేరాల నియంత్రణకు కట్టుబడి ఉండాలని అన్నారు.
పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారులకు ఎల్లవేలల భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న సిబ్బంది రెండురోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోని పోలీస్ స్టేషన్ వెల్లిన తర్వాత సిబ్బంది అందరికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు, అదనపు ఎస్.పి డబ్ల్యూ.ఎస్.డబ్ల్యూ హైదరాబాద్ శ్రీ జి. రాజారత్నమ్, సి.టి.సి, ఎ.సి.పి శ్రావణ్ కుమార్, కామారెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎస్. వీరయ్య, సీనియర్ ప్రోగ్రామర్ కో-ఆర్డినేటర్ చెనై రాజ్ కోటి, చైల్డ్ లైఫ్ ఇండియా ఫౌండేషన్ శ్రీ రమేష్, మహిళా సేఫ్టీ వింగ్ సి.ఐ రేణుకా, ఐ.టి కోర్ సి.ఐ శ్రీ ముఖీద్ పాషా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల సి.ఐలు, ఎస్.ఐలు, రిసిప్షనిస్టులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 04:14PM