నవతెలంగాణ-కంటేశ్వర్
తపాలా శాఖ అందిస్తున్న వివిధ రకాల పథకాల గురించి ఖానాపూర్ గ్రామ ప్రజలకి రమేష్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అవగాహన సదస్సు శనివారం నిర్వహించాడు. ముఖ్యంగా గ్రామీణ తపాలా జీవిత బీమా కేవలం గ్రామములో నివసించు ప్రజలకి ఆర్థిక అభివృద్ధి మరియు జీవిత భరోసాను కల్పించటానికి భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టింది అని వివరించాడు. అలాగే పది సంవత్సరాలు లోపు ఉన్న ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి ఖాతాను తెరవడం వలన ఆడపిల్ల భవిష్యత్తుకి భరోసా ని ఇచ్చిన వారు అవుతారు అని వారి తల్లి దండ్రులను కోరాడు. అలాగే పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచి నెల నెల కొంత డబ్బుల దాచుకోవడం వలన ఆర్థికంగా బలపడవచ్చు అని వివరించాడు. తపాలా శాఖ అందిస్తున్న ఇలాంటి మంచి పథకాలను గ్రామ ప్రజలు వినియోగించుకోవాలి అని కార్పొరేటర్ లలిత గంగాధర్ ప్రజలను కోరారు. ఈ అవగాహన సదస్సులో గ్రామ ప్రజలు ఖానాపూర్ ఏబిపిఎం చక్రపాణి పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 04:17PM