నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, దండు శేఖర్, యెండల ప్రదీప్ శ్రీనివాస్ గౌడ్ తదితరుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. వారు మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కి పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా నుడా చైర్మన్ శ్రీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది, దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం మనది, రాజ్యాంగాన్ని ఆమోదించి 73 ఏళ్ళు పూర్తైన సందర్భంగా అందరికి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. స్వరాష్ట్రం లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు పాలనలో దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి బాటలు పడుతున్న వేళ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ని స్మరించుకుంటూ, ప్రజలందరి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.