- ములుగు జడ్పీ వైస్ చైర్మన్ నాగజ్యోతి
- మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ -తాడ్వాయి
సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని, ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. శనివారం మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మండల కేంద్రానికి చెందిన మాలోతు నరసింహ(హోటల్)50 వేల రూపాయలు, కాటాపూర్ గ్రామానికి చెందిన తమ్మల్ల భాగ్యలక్ష్మి 25 వేల రూపాయల చెక్కు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేలాది మంది తీగ మధ్య తరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేత అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకుని బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న పేదలను ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రమణయ్య, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, మాజీ మండల అధ్యక్షులు బండారి చంద్రయ్య, శివయ్య, రజనీకర్ రెడ్డి, సల్లూరి లక్ష్మణ్, ఇంద్రారెడ్డి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 04:27PM